ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. తమ కార్యాలయాల్లో మహిళలను నియమించుకుంటే దేశంలోని అన్ని జాతీయ, విదేశీ ప్రభుత్వేతర గ్రూపులను మూసివేస్తామని పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వును పాటించడంలో విఫలమైతే, NGOలు దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు తమ లైసెన్స్‌ను కోల్పోతాయని హెచ్చరించింది. ఆఫ్ఘన్ మహిళలు సరిగ్గా ఇస్లామిక్ శిరస్త్రాణాన్ని ధరించనందున ఈ చర్యలకు పాల్పడింది.