ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సినీపరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. ఏపీలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి.
విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాలకు మౌలికసదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం’’ అని పవన్ అన్నారు.