భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(GSLV) NVS-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తుంది.
వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్‌లో GSLV మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. స్పాడెక్స్ మిషన్‌లో పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ జనవరి 7 వరకు పూర్తవుతుందన్నారు. చంద్రయాన్-4కి ఇది పరీక్ష లాంటిదన్నారు.