వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదయింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఏ6గా పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైల్లో ఉన్నారు.. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదయింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.