ప్రపంచ దేశాలు 2025 కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నాయి! అన్నింటికంటే ముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులు 2025కి స్వాగతం పలికాయి. భానుడి కిరణాలు మొదట పడే పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు మొదట కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటాయి. ఆఖరున హౌలాండ్ వంటి దీవులు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.ఒక్కో దేశం ఒక్కోసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ప్రపంచ దేశాల్లోని ప్రజలు 2025కు ఒకేసారి స్వాగతం పలకగలుగుతారు! కానీ వ్యోమగాములు మాత్రం 16 సార్లు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్లు తిరుగుతుంది.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్లు తిరుగుతూ 90 నిమిషాల్లో భూమిచుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసుకుంటుంది. అంటే 24 గంటల్లో భూమిచుట్టూ 16 సార్లు తిరుగుతుంది. అందుకే వ్యోమగాములకు కొత్త ఏడాదికి 16సార్లు స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యోదయాన్ని, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయాన్ని చూస్తారు.