రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న పనులు.
రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది.