రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని వ్యాఖ్యానించింది.
ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు.