తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానాయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానాలు వెళ్తుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి ఓ విమానం వెళ్లింది. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు.