అక్షర యాగానికి అంకురార్పణ జరిగింది. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా, వేల పుస్తకాలు కొలువుదీరాయి. ఈ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తొలిరోజే పుస్తక ప్రియుల తాకిడి మొదలైంది. రెండు తెలుగు రాషా్ట్రలు, ఉత్తరాది రాషా్ట్రల నుంచి ప్రచురణకర్తలు భారీగా తరలివచ్చారు. ఈసారి ఎక్కువగా ఉత్తరాది రాషా్ట్రల నుంచి ప్రచురణకర్తలు వచ్చారు. 2024లో ప్రచురించిన పుస్తకాలను స్టాళ్లలో ప్రదర్శించారు. కాగా, ఇప్పటి వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీలో ప్రతినిధులుగా పనిచేసిన వారిని పవన్ కల్యాణ్ పరిచయం చేసుకున్నారు. వారంతా ఆయనకు వివిధ రకాల పుస్తకాలను అందజేశారు. వీబీఎఫ్‌ఎస్ ప్రతినిధులు మహాభారత విజ్ఞాన సర్వస్వం పుస్తకాన్ని బహూకరించారు.