స్మాల్ క్యాప్ కేటగిరి సాఫ్ట్‌వేర్ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో స్టాక్ స్ప్లిట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు తేదీని ప్రకటించింది. దీంతో 1 షేరు కొన్నవారికి 2 షేర్లు రానున్నాయి. అంతే కాదు ఈ స్టాక్ లక్ష రూపాయలను రూ.8 లక్షలకుపైగా చేసింది. ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ స్టాక్ రూ.100లోపు ధర ఉన్న పెన్నీ స్టాక్. స్టాక్ స్ప్లిట్ తర్వాత రూ. 96 నుంచి షేర్ ధర రూ. 48 వద్దకు తగ్గనుంది.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవల జరిగిన కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే రూ. 2 ఫేస్ వ్యాల్యూ గల ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 2 షేర్లుగా విభజించనున్నారు. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ జనవరి 20, 2025గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు 2 శాతం లాభంతో రూ.97.98 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఒక దశలో రూ.100 మార్క్ దాటింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 261 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 46.08 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 4 శాతం లాభపడింది. గత నెల రోజులల్లో 26 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో ఈ షేరు సుమారు 54 శాతం పడిపోయింది. గత ఏడాదిలో ఈ షేరు 64 శాతం లాభాలు అందించింది. గత ఐదేళ్లలో 759 శాతం లాభాన్ని ఇచ్చింది. ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొంటే ఇప్పుడు వాటి విలువ రూ.8.59 లక్షలపైన ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2140 కోట్లుగా ఉంది. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ షేరుకి బై రేటింగ్ ఇస్తున్నట్లు ప్రముఖ అనలిస్టులు సూచిస్తున్నారు. కొత్త టార్గెట్ ధర రూ. 102.7గా సూచించారు. అలాగే రూ. 86.5 వద్ద స్టాప్ లాస్ ఎంచుకోవాలని సూచించారు.