భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. సెలెక్టర్లు గిల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పదే పదే విఫలమవుతున్నప్పటికీ జట్టులో చోటు కల్పిస్తున్నారని విమర్శించాడు. ఇందుకోసం ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారంటూ చెప్పాడు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడని, గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు.గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఈ విషయం తాను ప్రతిసారీ చెబుతున్నప్పటికీ ఎవరూ వినడంలేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సత్తా ఉన్న ఆటగాడని, అతడి టెక్నిక్ బాగుంటుందని మెచ్చుకున్నాడు. యాదవ్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, ఇండియా 'ఎ' టూర్‌లలో మెరుస్తున్న సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. ప్రతిభ కలిగిన యువ ప్లేయర్లను ప్రోత్సహించాలని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పాడు.