ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జన నాయకుడు కేంద్రంలో వినతిపత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. నేడు ఈ జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... పనితీరును పరిశీలించారు. జన నాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా, త్వరలో రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.