ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోళ్ల రూపురేఖల్లో వచ్చే మార్పులు వివిధ వ్యాధులకు సంకేతం

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jan 07, 2025, 04:03 PM

మీ చేతి గోళ్లు పెళుసుగా ఉన్నాయా? చేతులు కాస్త ఉబ్బి కనిపిస్తున్నాయా లేక మునివేళ్లు పాలిపోయాయా? అయితే మీలో ఏదో తీవ్రమైన అనారోగ్యం దాగి ఉన్నట్లే! మన ఆరోగ్య పరిస్థితి గురించి చేతి గోళ్లు, అరచేతులు తెలియజేస్తాయని యూకేలోని సర్కిల్ అలెగ్జాండ్రా హాస్పిటల్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ జాన్ లియర్ అంటున్నారు. ముఖ్యంగా గోళ్ల రంగు, రూపు, నిర్మాణంలో చోటుచేసుకొనే మార్పులు అనారోగ్యం గుట్టును చెబుతాయని అంటున్నారు. ఇక చర్మ సంబంధ అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు ఆస్పత్రి గ్రూప్ అయిన యూకేలోని ‘హెచ్ సీఏ ద షార్డ్’లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ జైనబ్ లాఫ్తా వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కొన్ని లక్షణాలకు వయసు లేదా జీవనశైలి కారణాలతో సంబంధం ఉంటుందని అంటున్నారు. కానీ పదేపదే అవే లక్షణాలు కనిపించినా లేదా లక్షణాలు ముదరినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.సాధారణంగా ఇది ప్రమాదకర సంకేతమేమీ కాదు. కేవలం మనలోని ఆందోళన లేదా బలహీన రక్తప్రసరణకు సంబంధించిన లక్షణాలకు సంకేతం. కానీ ఎగ్జిమా లేదా సోరియాసిస్ లాంటి చర్మ సమస్యకు కూడా ఇది సంకేతం కావొచ్చు. కేన్సర్, కాలేయ వ్యాధి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా వంశపారంపర్య కారణాల వల్ల పాల్మర్ ఎరిథీమా అనే అరుదైన పరిస్థితి వల్ల కూడా అరచేతులు ఎర్రబడతాయి. ఇది మునివేళ్లు, గోళ్ల మొదళ్లు, కొన్నిసార్లు అరికాళ్లపైనా ప్రభావం చూపుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధికి సైతం అరచేతులు ఎర్రబడటటం సంకేతం కావొచ్చు. ఎరిత్రోమెలాల్జియా అనే అరుదైన పరిస్థితి వల్ల అరచేతులు మంటపుట్టడం, ఎర్రబడటం, చర్మం కమిలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు. శరీరంలోని అనారోగ్య సమస్యను గుర్తించి చికిత్స పొందితే ఈ సమస్య పరిష్కారమవుతుంది.కీళ్లు, చేతి వేళ్ల మెటికల్లో వాపు కనిపించడం ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వ్యాధికి సంకేతం. ఒకవేళ చర్మం సైతం మంటెక్కుతుంటే అది సోరియాటిక్ ఆర్థరైటిస్ కావొచ్చు. దీనివల్ల దీర్ఘకాలిక కీళ్లనొప్పి, బిగువు, వాపు ఉంటాయి. కొందరిలో ప్రొటీన్ల లోపం, థైరాయిడ్ వ్యాధి లేదా సెల్యూలైటిస్ అనే చర్మ సమస్య వల్ల కూడా మెటికల్లో వాపు కనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణతో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. ఈ సమస్యలు ఉన్న వారు బరువు తగ్గడం, వ్యాయామం చేయడం కూడా మంచిది. ఇక సోరియాటిక్ ఆర్థరైటిస్ ను కార్టికోస్టెరాయిడ్లతో తగ్గించవచ్చు. సెల్యూలైటిస్ ను యాంటీబయోటిక్ లతో తగ్గించుకోవచ్చు. భోజనంలో ప్రొటీన్ తీసుకోవడం, విటమిన్ డీ సప్లిమెంట్ ద్వారా ఆల్బుమిన్, ప్రొటీన్ స్థాయిలను పెంచుకోవచ్చు.ఎగ్జిమా లేదా సోరియాసిస్, రేనాడ్స్ సిండ్రోమ్ లేదా చిల్ బ్లెయిన్స్, ఆర్థరైటిస్ సహా ఎన్నో కారణాలు చేతి నొప్పి, బిగువుకు కారణమవుతాయి. అలాగే చేతి మణికట్టు వద్ద ఉండే నరాలు కుచించుకుపోవడం వల్ల కూడా నొప్పి (కార్పల్ టన్నెల్ సిండ్రోమ్) కలుగుతుంది. ఇది అధిక బరువు, షుగర్ వ్యాధి, నిరంతరం చేతులు కదిలించాల్సి రావడం వంటి పనుల వల్ల కూడా వస్తుంది. చేతులను వెచ్చగా ఉంచుకోవడం, చలికాలంలో వెచ్చని దుస్తులు ధరించడం, సిగరెట్లు, ఆల్కాహాల్ మానేయడం ద్వారా చేతుల్లో రక్తప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది. అలాగే రక్తప్రసరణను తగ్గించేలా బిగుతైన దుస్తులు, పాదరక్షలు ధరించకపోవడం మంచిది.ఆందోళన, నిస్సత్తువ, అధిక కెఫీన్ సహా మరికొన్ని కారణాల వల్ల చేతుల వణుకు కనిపిస్తుంది. అయితే శరీరంలో తీవ్ర అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వణుకు కనిపించడమే దీని వెనకున్న అత్యంత సాధారణ కారణం. నాడీమండల వ్యవస్థపై ప్రభావం వల్ల అప్రయత్నంగా, క్రమానుగుణంగా వణుకు ఉంటుంది. అయితే కొందరిలో పార్కిన్సన్స్ వ్యాధి, ఇతర నరాల సంబంధ వ్యాధులు, థైరాయిడ్ అతి స్పందనల వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. కొన్ని నరాల లోపాలు కూడా చేతుల వణుకుకు కారణమవుతాయి.రేనాడ్స్ సిండ్రోమ్.. రక్తనాణాలు సంకోచించడం వల్ల మునివేళ్లకు రక్త సరఫరా నిలిచిపోయి అరచేతులు రంగుమారడం ఈ వ్యాధి లక్షణం. తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు ఉండటం, నొప్పి కూడా దీని లక్షణాలు. చల్లటి ఉష్ణోగ్రతల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది శరీరంపై రోగ నిరోధక వ్యవస్థ దాడిని కూడా తెలియజేస్తుంది. చేతి వేళ్లు ఎర్రబడటం సోరియాసిస్ లేదా ఎగ్జిమా లేదా గోళ్ల మొదళ్లకు సోకే పారోంకియా అనే బాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను సైతం సూచిస్తుంది. చేతులకు గ్లోవ్స్ ధరించడం, మందులు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. డెర్మటైటిస్ లేదా సోరియాసిస్ వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎర్రటి పొలుసులతోపాటు కొన్నిసార్లు చీము కురుపులు కూడా ఏర్పడి పగులుతుంటాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఎగ్జిమా వల్ల చేతులు పొడిబారడం, ఎర్రబడటం, దురదపెట్టడం, మంటపుట్టడం ఉంటుంది. గోళ్ల చుట్టూ నొప్పి వల్ల అవి ఎగుడుదిగుడుగా మారడం లేదా రంగుమారడం కనిపిస్తుంది. అలర్జీ వల్ల వచ్చే డెర్మటైటిస్ లోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు చేతులు కడుక్కున్నాక శుభ్రంగా తుడుచుకోవడం, తరచూ మాయిశ్చరైజర్లను వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. అలర్జిక్ డెర్మటైటిస్ సోకిన వారు అలర్జీ కలిగించే నికెల్, లేటెక్స్ లేదా సబ్బులను ఉపయోగించకూడదు.ఈ సమస్యను ల్యూకోనైకియా అంటారు. చిన్నపాటి గాయం వల్ల గోళ్ల మొదళ్ల వద్ద చిన్నచిన్న తెల్ల చుక్కలు లేదా తెల్ల మచ్చలు కనిపిస్తాయి. జింక్ లోపం, ఎగ్జిమా చర్మ వ్యాధి లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో క్యాల్షియం అధిక నిల్వల వల్ల కూడా గోళ్లపై తెల్ల చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇదేమీ అంత ప్రమాదకరం కాదు. కానీ గోళ్లు పొలుసులుగా మారితే మాత్రం గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందనేందుకు సంకేతం. ప్రొటీన్ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్ల వాడకం ద్వారా దీనికి చికిత్స పొందొచ్చు.ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల (ఓనికోమికోసిస్) గోళ్లు మందంగా మారడం, రంగు మారడం (ఎక్కువగా పసుపుపచ్చగా) లేదా పెళుసుబారడం కనిపిస్తుంది. ఒకవేళ గోళ్లు పూర్తిగా పసుపుపచ్చగా మారాయంటే ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన సమస్య ఉందని అర్థం. అలాగే గోళ్లు పెళుసుబారడం లేదా నెమ్మదిగా పెరగడం అధిక కొలెస్టరాల్ కు సంకేతం. విటమిన్ లేదా ఐరన్ లోపం వల్ల కూడా గోళ్లు పెళుసుబారతాయి. పారోనైకియా లేదా సోరియాసిస్ వల్ల కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. వీరు అధిక ప్రొటీన్, ఐరన్, జింక్ గల పోషకాహారాన్ని తీసుకోవాలి.ఎగ్జిమా లేదా థైరాయిడ్ వ్యాధి ఉన్న వారికి గోళ్లపై చిన్నపాటి గుంతల్లా ఏర్పడుతాయి. సోరియాసిస్ వల్ల కూడా గోళ్లు గతుకులుగా మారడం, గట్టిపడటం, రంగుమారడం కనిపిస్తుంది. నెయిల్ బెడ్ నుంచి గోళ్లు పైకి జరుగుతాయి. దీన్ని ఓనికోలైసిస్ అంటారు. గోళ్లపై గతుకులు వివిధ రకాల అంతర్గత లేదా బహిర్గత మార్పులు లేదా నొప్పికి సంకేతం. సోరియాసిస్ వ్యాధి చికిత్సలో వాడే క్రీములు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు గోళ్లపై పెద్దగా పనిచేయవు. ఎందుకంటే ఆ మందులు గోళ్లలోకి చొచ్చుకెళ్లలేవు. దీనికి ప్రత్యేకంగా లైట్ థెరపీ చేస్తారు.పైన చెప్పిన అంశాలు కేవలం వైద్య నిపుణుల సూచనలు మాత్రమే. చేతులు, గోళ్లు సహా ఏ రకమైన సమస్యలు ఉన్నా ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి, తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకుని... సమస్య ఏమిటనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తగిన మందులు వాడి ఉపశమనం పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com