బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని, సమష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన బాల్య వివాహ రహిత భారత్ ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది.