సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారతీయ రైల్వే చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రత్యేక రైలు నడుపుతోంది. మంగళ, గురు, ఆదివారాల్లో నడిచే ఈ రైలులో జనవరి 14వ తేదీన బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో 14వ తేదీ రాత్రి 7.20 గంటలకు బయలుదేరే ఈరైలు 15వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు మీదుగా ఈ రైలు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ తరగతులు ఈరైలులో అందుబాటులో ఉండగా మంగళవారం (7 జనవరి 2025) ఉదయం 9.30 గంటల పమయానికి స్లీపర్ క్లాస్‌లో 400 బెర్తులు అందుబాటులో ఉండగా.. ఏసీ త్రీటైర్‌లో 148, ఏసీ టు టైర్‌లో 60, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో నాలుగు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.అలానే భారతీయ రైల్వే కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 15వ తేదీన కూడా ఏసీ ప్రత్యేక రైలు నడపనుంది. దీనికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు జనవరి 15వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ఈ రైలు మల్కజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతూ శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈరైలులో కేవలం ఏసీ త్రీ టైర్ బెర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మంగళవారం (7 జనవరి 2025) ఉదయం 9.30 గంటల పమయానికి థర్డ్ ఏసీలో వెయ్యికి పైగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి.