అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాలు...మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(28)కి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు. అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి 9, 7 ఏళ్ల వయసున్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వారించింది. అయినా భర్త ధోరణిలో మార్పు రాకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినది వాస్తవమని తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.