ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు.
చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.