ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత సంపదను సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడన్నారు.
పవన్ కరిగిపోయే మనసున్న నేత అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ప్రధాని తొలిసారి విశాఖకు వస్తున్నారని తెలిపారు. మోదీకి నీరాజనం పలికేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.