ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నాం. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగిస్తున్నాం.
ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం’’ అని వెల్లడించారు.