జపాన్‌లోని టోక్యో చేపల మార్కెట్లో నూతన సంవత్సరంలో నిర్వహించిన తొలి వేలంలో ఓ ట్యూనా చేప భారీ ధర పలికింది. 276 కిలోల బ్లూఫిన్ ట్యూనాను ఒండెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంటు నిర్వాహకులు సుమారు రూ.11కోట్లు(1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. కొత్త ఏడాదిలో వచ్చే తొలి ట్యూనా చేప అదృష్టాన్ని తీసుకొస్తుందని జపనీయులు విశ్వసిస్తుంటారు. అందుకే వేలంలో దాన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. 2019లో నిర్వహించిన వేలంలో ఓ ట్యూనా చేప ఏకంగా రూ.18 కోట్లు పలికింది.