పిఠాపురం మండలం కుమారపురంలో 12,500 మినీ గోకులంషెడ్లను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆవు బాగుంటేనే రైతు బాగుంటాడు.. అప్పుడే దేశం బాగుంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం వేలాది డెయిరీలను చంపేసిందని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా అనవసర ఖర్చుచేసిందని, అందుకే రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి కూటమి కష్టపడుతోందన్నారు. ఈసారి సంక్రాంతిని ఘనంగా జరుపుకుందామని అనుకున్నట్లు, తిరుపతి ఘటనతో తగ్గించేసినట్లు చెప్పుకొచ్చారు.