AP: తూ.గో. జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహిళలు పిడకలతో భోగి మంటలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పూర్వికుల ఆచార సంప్రదాయం ప్రకారం.. ఇంటి నుంచి కనీసం ఒక పిడకైనా ప్రతి ఏటా బోగి మంటకు సొంతంగా తయారు చేసుకుని వేయాలి. ఏటా భోగి సమయానికి గ్రామంలో ప్రతిఒక్కరూ 116 నుంచి 1116 వరకు ప్రతి ఒక్కరూ భోగి మంటల్లో పిడకలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే లక్ష్మి అనే మహిళ 1,00,116 పిడకలు భోగి మంటకు సిద్ధం చేశారు.