ఎమ్మిగనూరు పాత ఎమ్మార్వో కార్యలయం ముందు మైదానంలో ఆదివారం నియొజకవర్గ పాత్రికేయుల టెన్నిస్ బాల్ తో వాలీబాల్ టోర్నమెంట్ కు దేశాయి నెట్ వర్క్ అదినేత, నందవరం మండల టిడిపి నాయకులు గురురాజ్ దేశాయిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మిగనూరు నియొజకవర్గ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరు కలసి ఆయనను ఘనంగా సన్మానించారు. సమాజ శ్రేయస్సుకు కృషి చేయడంలో పాత్రికేయుల పాత్ర ముఖ్యమైనదని గురురాజ్ తెలిపారు.