సంక్రాంతి పండగ చేసుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాక్ తగిలింది. అంతర్జాతీయంగా కమ్ముకున్న యుద్ధ వాతావరణంతో పాటు, నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో నూనెల ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్ లీటర్ ధర రూ.94-129కి చేరింది. సన్‌ఫ్లవర్ నూనె రూ.147160, పల్లీ నూనె లీటరుకు రూ.145-150, రైస్ బ్రాండ్ రూ.147-160కి చేరాయి. ప్రస్తుతం శనగపప్పు కిలో రూ.100, నువ్వులు కిలో రూ.170, బెల్లం రూ.70, గోధుమ పిండి ప్యాకెట్ రూ.60గా ధరలు ఉన్నాయి.