త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుంది. 20 లక్షల ఉద్యోగాల నియామకానికి సన్నాహాలు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం త్వరలో అమలవుతుంది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకూ రూ.20వేలు, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అంది స్తాం. మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలు పొందొచ్చు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఔటర్ రింగు రోడ్డు పనులతో అభివృద్ధి జెట్ స్పీడుతో ముందుకెళుతోంది అని సభలో మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు.