ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఇందు కోసం విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మంత్రి లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు కొల్లు తెలిపారు. దీంతో వారిలో నైపుణ్యాలు పెరిగి ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారవుతారని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మరోవైపు ఎంసెట్‌కు సైతం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావడమే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నడుస్తుందనడానికి ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.