తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఓ అఘోరీ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల సమీపంలో మరోసారి అఘోరీ ప్రత్యక్షం అయ్యింది. తన కారును రోడ్డు పక్కనే ఆపి.. కారులోనే నిద్రించింది. ఇది తెలుసుకున్న ప్రజలు.. అఘోరీని చూసేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అఘోరీలు అంటే ప్రజలకు దూరంగా జీవనం గడుపుతుంటారని.. నిత్యం దైవస్మరణతో జీవిస్తారని.. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని ఫైరయ్యారు. ఇక తర్వాత కొద్ది రోజుల నుంచి ఎవరికి కనిపించకుండా ఉన్న అఘోరీ మాత మళ్లీ ప్రత్యక్షం అయ్యింది. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల సమీపంలో అఘోరీ ప్రత్యక్షం అయ్యింది. తన కారును రోడ్డు పక్కనే ఆపి.. కారులోనే నిద్రించింది. ఇది తెలుసుకున్న ప్రజలు అఘోరీ మాత మళ్లీ వచ్చిందంటూ.. అఘోరీని చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో అఘోరీని ఫొటోస్, వీడియోలు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.