మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి. అయితే నీటిలో కరిగే పోషకాలను రోజూ తీసుకోవాలి. కానీ కొవ్వులో కరిగే విటమిన్లను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తీసుకుంటే చాలు. అలాంటి విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది కొవ్వులో కరుగుతుంది. కనుక ఈ విటమిన్ ను రోజూ తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్ డి మన శరీరానికి తగినంతగా లభిస్తే శరీరం ఈ విటమిన్‌ను నిల్వ చేసుకుంటుంది. తరువాత అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది. అయితే విటమిన్ డి మనకు ఎలా లభిస్తుందో అందరికీ తెలిసిందే. దీన్ని మనం సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. రోజూ ఉదయం కాసేపు సూర్య రశ్మిలో శరీరం తగిలేలా ఉంటే దాంతో మన చర్మం కింది భాగంలో విటమిన్ డి తయారవుతుంది. కనుకనే డాక్టర్లు సైతం రోజూ కాసేపు ఎండలో నిలబడాలని చెబుతుంటారు. అయితే విటమిన్ డి మనకు పలు వెజిటేరియన్ ఆహారాల్లోనూ లభిస్తుంది.