ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఘోర ప్రమాద జరిగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో పలువురు సైనికులు గాయపడ్డారు. కోబ్రా యూనిట్‌లో పని చేస్తున్న మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాక్‌కు కాళ్లకు గాలయ్యాయయి. వెంటనే వారిని బీజాపూర్ ఆసుప్రతికి తరలించారు. అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.