గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరు దురదృష్టకరమని మేయర్ కావటి మనోహర్ పేర్కొన్నారు. గురువారం గుంటూరులో వైయస్ఆర్‌సీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కౌన్సిల్ నుంచి కమిషనర్ వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కమిషనర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఈ నెల 7న కమిషనర్‌కు సమాచారం ఇచ్చినా ..ఆయన స్పందించలేదన్నారు. రేపు కమిషనర్ వ్యవహరించే తీరును బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మేయర్ స్పష్టం చేశారు.