కోడి పందెం ముసుగులో గొడవ పడి వైయస్ఆర్‌సీపీ నేత మణితేజను పచ్చ గూండాలు హతమార్చారు.నందిగామ నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నేత మణితేజను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారని, ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే అంటూ వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెట్టింది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేశారు అని వాపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.