ఏపీ సీఎం చంద్రబాబును భారత యువ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. సీఎం చంద్రబాబుతో నితీశ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. వీరి సమావేశంలో పలు కీలక విషయాలను సీఎం చంద్రబాబుకు నితీష్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు.అయితే నితీశ్‌కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. నితీశ్ సెంచరీ చేయడంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ. 25 లక్షలు ప్రకటించింది. ఈ నగదును సీఎం చంద్రబాబు నితీశ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయడం అపురూపమైన అనుభవమని తెలిపారు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారి సత్తాను నితీశ్ ప్రపంచానికి చాటారని చంద్రబాబు ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.