కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. గురువారం భామిని మండలం లోని నేరడిలో టీడీపీ, కూటమి పార్టీల కార్యకర్తలతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోరాష్ట్రం అప్పులఊబిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.అనంతరం బాలేరు, నేరడి ఇటీవల మృతి చెందినజి.రాజులు, బి.శిమ్మయ్య, ఎస్.తవిటమ్మ, బి.రామారావు కుటుంబ సభ్యులు పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జగదీష్, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయానికి సంబంధించి వివిధ పరికరాలు సబ్సిడీపై రైతులకు అందిస్తూ కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. గురువారం మండలంలోని ఎం.రాజపురంలో రైతులకు నూర్పుయంత్రాలను వీరఘట్టం, పాలకొండమండలాల్లోని రైతులకు అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ మండల పరిషత్ అధ్యక్షులు బొమ్మాళి భాను, కూటమినాయకులు కర్నేన అప్పలనాయుడు, పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, ఉద యానఉదయ్‌భాస్కర్, సుధాకర్, పొగిరి శివన్నారాయణ, బొమ్మాళి సురేష్ పాల్గొన్నారు.