ఆంధ్రప్రదేశ్‌లో చెత్త నిర్మూలన, రీసైక్లింగ్ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టిందిఇకపై ప్రతీ నెలలో మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గుంటూరు జిల్లా.. నంబూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పారిశుధ్య కార్మికులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టగా.. తాము అధికారంలోకి వచ్చాక.. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న పవన్ కళ్యాణ్.. జీతాలు పెంచాలనే అభ్యర్థన తన దృష్టికి వచ్చిందనీ, కచ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా.. కృష్ణా నది వరదల సమయంలో.. ప్రజలకు సేవలు అందించిన 35 మంది పారిశుధ్య కార్మికులను పవన్ కళ్యాణ్ సన్మానించారు.