మసాలాలో ముఖ్యమైనది దాల్చిన చెక్క. ఇది భారతీయ వంటకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని తరుచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట.