AP: పందెంలో చనిపోయిన కోడి పుంజుకు రూ.లక్ష పెట్టి కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఏలూరు ఎన్ఆర్‌పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ పందెం కోడి పుంజును పెంచారు. ఆ కోడి గురువారం పందెంలో పోరాడి ఓడిపోయింది. పుంజు పోరాట పటిమ నలుగురికీ తెలియాలని దాన్ని శుక్రవారం వేలం వేశారు. ఈ వేలంలో ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ.1,11,111కు దక్కించుకున్నారు.