తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్‌ఆర్‌వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 'ఎన్టీఆర్'ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.జ్వాల. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు' అని సీఎం కొనియాడారు.