ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతిమరుపుని మాయం చేసి బ్రెయిన్‌ని షార్ప్‌గా చేసే అలవాట్లు, రోజూ ఫాలో అయితే మెదడు పాదరసంలా మారుతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 11:15 PM

బండి కీ ఎక్కడో పెట్టాను అస్సలు గుర్తురావట్లేదు, అరెరె ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే మర్చిపోయానే.. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోయాను అని చెబుతుండడం కామన్. వయసు పెరగడం, ఒత్తిళ్లు ఇతర కారణాల చాలా మందికి మతిమరుపు సమస్యలొస్తున్నాయి. పిల్లలకి కూడా చదివింది గుర్తుండడం లేదు. దీంతో అన్నీ చదివినా పరీక్ష హాల్లో సరిగా గుర్తు రాక మార్కులు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం బ్రెయిన్‌ని సరిగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రెయిన్ హెల్దీగా ఉంటే మతిమరుపు, ఇతర సమస్యలు రావు. అలా బ్రెయిన్ హెల్దీగా ఉండాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఉదయాన్నే చేసే కొన్ని పనులు మన బ్రెయిన్‌ని హెల్దీగా ఉంచుతాయి. ఉదయాన్నే లేవడం చాలా మంచిది. కానీ, లేట్‌గా లేవడం, ఆఫీస్‌కి లేట్‌గా వెళ్లడం వంటివి మన బ్రెయిన్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాకాకుండా సరైన మార్నింగ్ రొటీన్‌ ఏంటో తెలుసుకుని ఫాలో అయితే బ్రెయిన్ హెల్త్ బూస్ట్ అవుతుంది.​


నీరు తాగడం


ఉదయం లేవగానే నీరు తాగాలి. రాత్రంతా నీరు తాగకుండా ఉంటారు. కాబట్టి, డీహైడ్రేషన్ ఉంటుంది. దీని వల్ల బ్రెయిన్ పనితీరు సరిగా ఉండదు. కాబట్టి, మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఎనర్జీ, కాన్సంట్రేషన్ లెవల్స్ పెరుగుతుంది. అందులో కొద్ది నిమ్మరసం కలిపితే రీఫ్రెషింగ్ ఫీల్ అవుతుంది.


ఎండలో ఉండడం


ఎండలో ఉండడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల సెరటోనిన్, మెలటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీంతో మూడ్, స్లీప్ సైకిల్ పెరుగుతుంది. మెంటల్లీ షార్ప్‌గా ఉంటారు. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది.


హెల్దీ బ్రేక్‌ఫాస్ట్


ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. పోషకాలు నిండి ఉన్న గుడ్లు, బెర్రీస్, నట్స్, హోల్ గ్రెయిన్స్ వంటి ఫుడ్స్ తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. దీంతో ఫోకస్ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది.


ప్రతీది జర్నల్ చేయడం


మీరు పూర్తి చేయాల్సిన పనులు, పూర్తి చేసిన గోల్స్ వంటివాటిని ప్రతి ఒక్క విషయాన్ని రాయాలి. ఓ పాజిటీవ్ నోట్ రాయడం వల్ల మైండ్ సెట్ పాజిటీవ్‌గా ఉంటుంది. యాంగ్జైటీ తగ్గుతుంది. ఏదైనా సమస్య వచ్చినా సాల్వ్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. అదే విధంగా, పజిల్స్ సాల్వ్ చేయడం, చదవడం, రాయడం వంటివి చేయడం మంచిది. దీని వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. మైండ్ షార్ప్‌గా మారుతుంది.


కొద్దిగా స్ట్రెచింగ్


భారీ వర్కౌట్స్ చేయకపోయినా కొన్ని వర్కౌట్స్, యోగా వంటివి చేయాలి. దీని వల్ల బ్రెయిన్‌కి రక్త సరఫరా సరిగా ఉంటుంది. దీంతో ఎండార్ఫిన్స్ రిలీస్ అవుతాయి. దీంతో స్ట్రెస్ తగ్గుతుంది. అలర్ట్‌నెస్ పెరుగుతుంది. మీ బాడీ, మైండ్ రెండు కూడా మెంటల్ టాస్క్‌లకి సిద్ధమైపోతుంది. దీంతోపాటు మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. మెమొరీ పెరుగుతుంది. కామ్‌గా ఉండి కాసేపు మెడిటేషన్ చేస్తే మెంటల్ హెల్త్ బాగుంటుంది. బ్రిస్క్ వాక్, షార్ట్ వర్కౌట్ చేయడం వల్ల దీని వల్ల రక్తసరఫరా మెరుగ్గా ఉంటుంది. బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది.


ఒకే టైమ్‌కి లేవడం


రోజుకి ఒకే టైమ్‌కి లేవాలని గుర్తుపెట్టుకోండి. దీని వల్ల మన బ్రెయిన్‌కి ఓ టైమింగ్ అనేది సెట్ అయిపోతుంది. దీంతో మంచి నిద్ర కూడా మీ సొంతమవుతుంది. బ్రెయిన్‌పై నెగెటీవ్ ఎనర్జీ దూరమవుతుంది. దీంతో ఏకాగ్రత పెరగడమే కాకుండా మంచి డేని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.


సోషల్ మీడియాకి దూరంగా


వాట్సప్‌లో మెసేజెస్ వచ్చాయి, సోషల్ మీడియాలో ఏ రీల్ చూద్దాం.. ఇలాంటివన్నీ చేయొద్దు. సోషల్ మీడియాతో మీరు డిస్ట్రాక్ట్ అవుతారు. కాబట్టి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. దీంతో స్ట్రెస్ తగ్గుతుంది. బ్రెయిన్ కూడా టాస్క్‌లు చేసేందుకు ఈజీగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com