అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణి కొట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్ల లక్ష్యాన్ని కేవలం 26 బంతుల్లోనే చేస్ చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణి కొట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్ల లక్ష్యాన్ని కేవలం 26 బంతుల్లోనే చేస్ చేసింది. దీంతో వెస్టిండీస్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో కేవలం 44 పరుగులు చేసి, ఆలౌటైంది. ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా.. కేవలం 4.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లు ఆడలేకపోయింది. దీంతో జట్టు మొత్తం 13.2 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. టోర్నీ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం. 45 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి విజయం సాధించింది. కమలిని, చాల్కే కలిసి మ్యాచ్‌ను ముగించేశారు.