కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ రాజమండ్రి, కొవ్వూరు నుంచి ప్రత్యేక సర్వీస్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా మహా కుంభమేళాను సందర్శించేందుకు తీసుకెళ్తుంది.ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టీ, ప్రయాణీకులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళాకి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.రాజమండ్రి, కొవ్వూరు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వొరు బస్ కాంప్లెక్స్‌లో బస్ బయలుదేరుతుంది. భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్-మహా కుంభమేళా వారణాసి, గయ, బుద్ధగయ, అరసవిల్లి, శ్రీకూర్మం యాత్ర ఉంటుంది. త్రివేణి సంఘమ స్నానం, విశ్వనాధ దర్శ, గయ పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.
ఏడు రోజులు పాటు యాత్ర కొనసాగుతుంది. ప్రయాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుంది. టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.10,000గా ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. తాగేందుకు వాటర్ కూడా ఇస్తారు.టిక్కెట్టు కావాలనుకునేవారు కొవ్వొరు బస్సు డిపోను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. అదనపు సమచారం కోసం 7382907952 (సూర్య చంద్రరావు), 8121582849 (రామకృష్ణ) సంప్రదించండి.ఏపీఎస్ఆర్టీసీ సాంకేతకతను ఉపయోగించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తోంది. మొబైల్ యాప్ సహాయంతో ప్రయాణీకులందరూ ఎక్కడ ఉన్నా బస్సు వద్దకు చేరుకోవచ్చు. ఈ యాప్‌ను బస్సు బయలుదేరేనప్పుడు ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ వల్ల ప్రయాణికులు ప్రయోజనం కలుగుతోంది. బస్సు ఎక్కడుందో అందులో స్పష్టం అవుతుంది. భక్తులు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సాంకేతికతను తీసుకొచ్చినట్లు ఆర్టీసీ చెబుతోంది.