ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇటీవల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొత్త రాగం అందుకున్నారు. మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు తమ మద్దతును బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ తన డిమాండ్‌ను తెలియజేశారు.