బస్సు టైరు పేలి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 47 మంది ప్రయాణికులతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ స్లీపర్ బస్సు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలో పాదాలమ్మ గుడి సమీపంలోకి రాగానే బస్సు టైరు పేలింది. అదుపు తప్పి ఎదురుగా డివైడరు దాటి పొలాల్లోకి దూసుకెళ్లి పొలాల్లో నిలిచింది. ఈ ఘటనలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవే పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను రక్షించింది. హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ట్రావెల్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మీ కాంతం సహాయ చర్యల్లో పాల్గొన్నారు.