రాష్ట్రంలో రేపటి నుంచి బాలల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలకు ఎటువంటి బయోమెట్రిక్ లేకుండా ఫొటో, పేరు, అడ్రస్, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతోనే ఆధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 11.65 లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేవని అధికారులు గుర్తించారు. దీంతో ఈ బాల ఆధార్ కార్డులను జారీ చేయనున్నారు.