గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి వెన్నుముకకు ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా గుంతకల్లుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు సోమవారం వెంకట్రామారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు.