అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికాలో ఉదయం 11 గంటలకు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ట్రంప్.అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలు అవుతుందన్న మాట. ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ప్రపంచానికి పెద్దన్నగా పిలువబడే అమెరికా అధ్యక్షుడి భద్రత విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్న అత్యంత భద్రతతో కూడిన వాహనాలనే వినియోగిస్తారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యున్నత భద్రతతో కూడిన ఎయిర్ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఇది ఎలాంటి పేలుళ్లను అయినా తట్టుకోగలుగుతుంది. ఇలాంటివి ఒకటివి కాదు ఏకంగా ఏడు ఉంటాయి. ఇక అగ్రరాజ్యంలో అత్యంత భద్రమైన బీస్ట్ కారులో అధ్యక్షుడి ప్రయాణం ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కూడా ఈ కారునే అధ్యక్షుడి వెంట తీసుకెళ్తుంటారు.
ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా సరే అతడు ఉండే హోటల్ నుంచి అత్యాధునిక వసతులతో కూడిన హాస్పిటల్ కేవలం 10 నిమిషాల కంటే తక్కువ టైమ్ లో చేరుకునేలా ఉండాలి. ఏదైనా జరిగితే వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లా్ల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన లిస్ట్ అతడి సిబ్బంది వద్ద ఉంటుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ కోసం అమెరికా అధ్యక్షుడి కారులో ఎల్లప్పుడూ ఒక బ్లెడ్ ప్యాకెట్ ఉంటుంది. ఆసుపత్రికి వెళ్లేలోపు రక్తం ఎక్కాంచాల్సి వస్తే అధ్యక్షుడి బ్లెడ్ గ్రూప్ రక్తాన్ని సిద్ధంగా ఉంచుతారు. భద్రత ప్రోటోకాల్లో మరో కీలక అంశం ఏంటంటే.. బహిరంగ ప్రదేశంలో అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో 45 నిమిషాలు మించి ఉండకూడదు.
సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర
అధ్యక్షుడి భద్రతలో అమెరికా సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సీక్రెట్ సర్వీసులో దాదాపు 7 వేల మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. వీరి ట్రైనింగ్ను అత్యంత కఠినంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా శిక్షణల్లో ఒకటిగా భావిస్తారు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశం వెళ్లాలని అనుకుంటే మూడు నెలల ముందు నుంచే సీక్రెట్ సర్వీస్ తమ పనులు ప్రారంభిస్తుంది.అధ్యక్షుడు ఎక్కడ బస చేయాలి అనేది కూడా సీక్రెట్ సర్వీస్ నిర్ణయిస్తుందిఅమెరికా అధ్యక్షుడికి మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు. ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ అమెరికా తమ నలుగురు అధ్యక్షులు హత్యకు గురయ్యారు.