AP: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న(29) మొదటి భార్య ఇటీవల మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన ఆయనకు తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు. మద్యం మానేయడం ఇష్టంలేక అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.