తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా.. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిక్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఇవాళ (సోమవారం) ఉదయం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్లోని హోటల్ హిల్టన్‌లో నిర్వహిస్తున్న "తెలుగు డయాస్పొరా మీట్"లో వీరిద్దరూ పాల్గొనున్నారు.ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రోడ్డుమార్గాన దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు.