2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా ఆదివారం తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపారు. ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.రోజుకు 70 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారుల ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు కూడా ఒక ఉద్యోగికి ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేశారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. భద్రతా సిబ్బంది కూడా తనిఖీలను వేగవంతం చేసి కార్లను తిరుమలకు పంపించారు.