ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. దీంతో అటవీ ప్రాంతం రణరంగంగా మారింది. ఛత్తీస్‌గఢ్ గరియాబంధ్‌లో భీకర ఎన్‌కౌంటర్ మొదలైంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే 27 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 16 మంది మావోయిస్టుల మృతదేహలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.