గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ కోసం మంగళవారం హైదరాబాద్ కు చెందిన చీఫ్ డిజైన్ ఇంజినీర్ అల్లం కొండ రామాంజనేయులు, కసాపురం ఆలయ ఈవో వాణితో కలిసి ఆలయ పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు.
చీఫ్ డిజైన్ ఇంజనీర్ మాట్లాడుతూ. ఆలయ అభివృద్ధితోపాటు భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామన్నారు.